శంకర్ తో సినిమా పై చరణ్ ట్వీట్ !

Published on Jul 5, 2021 12:11 pm IST

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా నేషనల్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుందనే వార్త నేటితో అధికారిక వార్తగా మారింది. తాజాగా రామ్ చరణ్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబం ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. అతి త్వరలో అన్ని వివరాలు తెలుస్తాయి’ అంటూ చరణ్ ట్వీట్ చేశాడు.

ఇక ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందించబోతున్నారు. అయితే, నేపథ్య సంగీతాన్ని మాత్రం అనిరుధ్ రవిచందర్ ఇస్తున్నాడట. ఇక చరణ్ – శంకర్ కాంబినేషన్ తొలిసారి కావడంతో బడ్జెట్ పై ఎలాంటి ఆంక్షలు లేకుండా సినిమాని భారీ హంగులతో తెరకెక్కించడానికి శంకర్ సన్నద్ధం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :