మోడీని అనుసరిద్దామంటూ చరణ్ సందేశం

Published on Apr 4, 2020 4:03 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు సోషల్ మీడియా వేదికగా ఓ సందేశం పంపారు. మోడీ ఆదేశాల మేరకు రేపు రాత్రి 9గంటలకు అందరూ ఇంటిలో ఉన్న లైట్స్ తీసివేసి తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగిద్దాం అన్నారు. కరోనా రహిత భారత దేశ స్థాపన కోసం, ప్రజలలో స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమం అందరం నిర్వర్తిద్దాం అని చరణ్ చెప్పు కొచ్చారు. ఇప్పటికే మెగా హీరోలు దీనికి మద్దతుగా సోషల్ మీడియా ద్వారా స్పందించగా, ప్రధాని మోడీ వారికి తిరిగి కృతజ్ఞతలు తెలపడం విశేషం.

ఇక ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా చేస్తుండగా ఆయన ఫస్ట్ లుక్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ దక్కింది. మే నుండి మొదలుకానున్న ఆర్ ఆర్ ఆర్ పూణే షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొనాల్సివుంది. ఈ షెడ్యూల్ నందు అలియా భట్ కూడా పాల్గొంటారు. ఆర్ ఆర్ ఆర్ అలియా చరణ్ కి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More