చరణ్ అప్పటికి రెడీ అవుతాడట.!

Published on Apr 20, 2021 7:01 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో “ఆచార్య” మరోపక్క దర్శక ధీరుడు రాజమౌళి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో “రౌద్రం రణం రుధిరం” అనే రెండు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ రెండు చిత్రాలు అనంతరం మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ను చరణ్ సెట్ చేసుకున్నాడు. అదే ఇండియన్ జేమ్స్ కామెరాన్ శంకర్ తో.. ఎలాంటి సబ్జెక్టుతో వీరు వస్తున్నారో కానీ ఈ కాంబోపై అంచనాలు మాత్రం అనేకం. అయితే మరి ఈ సినిమా షూట్ కోసం చరణ్ జూన్ నాటికి ఎలా అయినా సిద్ధం కావాలని అనుకుంటున్నాడట.

ఇప్పుడు చేస్తున్న ఆచార్య సహా రాజమౌళి సినిమాలు వరుసగా చేసి జూన్ కన్నా ముందే కంప్లీట్ చేసి మరోపక్క శంకర్ సినిమాకు కావాల్సిన మేకోవర్ ను ప్రిపేర్ చేసి సన్నద్ధం అవ్వనున్నాడని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఫైనలైజింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు టాక్.. మరి ఈ భారీ చిత్రం అనుకున్న సమయానికి మొదలవుతుందో లేదో చూడాలి..

సంబంధిత సమాచారం :