మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 9వ సినిమాని ప్రారంభిన రోజునే ఈ సినిమాని అక్టోబర్ 15న దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసాడు. అందులో భాగంగానే షెడ్యూల్ కి షెడ్యూల్ కి ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. మొదలైన రెండు నెలల్లోనే 50% పైనే షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు. కామెడీ టచ్ ఉన్న యాక్షన్ ఎంటర్ టైనర్స్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీం ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో షూట్ చేస్తున్నారు. రామ్ చరణ్, రావు రమేష్, నదియా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా థాయ్ ల్యాండ్ షెడ్యూల్ ఆగష్టు 12 కి పూర్తి కానుంది. ఆ రోజే హైదరబాద్ కి తిరిగి రానున ఈ చిత్ర టీం ఆగష్టు 13 నుంచి సరికొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు కానుంది. కాస్త గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల తన ఓల్డ్ రైటర్స్ అయిన కోన వెంకట్ – గోపి మోహన్ లతో కలిసి పని చేస్తున్నాడు. రామ్ చరణ్ ఓ ఫైట్ మాస్టర్ గా కనిపించనున్న ఈ సినిమాకి బ్రూస్ లీ, ఫైటర్ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


