చరణ్ తమిళ్ రీసౌండ్ రెడీ అయ్యింది.!

Published on Apr 21, 2021 1:00 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలు ఏవన్నా ఉన్నాయి అంటే అవి ఒకటి “మగధీర” ఇంకొకటి “రంగస్థలం” సినిమాలు అనే చెప్తారు. అయితే రంగస్థలం సినిమాతో సుకుమార్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటకి తీసుకొచ్చి మరో మెట్టు ఎక్కించారు. వినికిడి సమస్య ఉండే రోల్ లో నటించి చరణ్ బాక్సాఫీస్ దగ్గర గట్టి రీసౌండ్ తెప్పించాడు.

అయితే ఒక్క తెలుగులోనే భారీ వసూళ్లను కొల్లగొట్టిన చరణ్ ఈ సినిమాతో ఇతర భాషల్లోకి కూడా వెళ్తున్నాడు. ఆల్రెడీ కన్నడలో విడుదల కాబడిన ఈ చిత్రం తమిళ్ లో కూడా విడుదలకు రెడీ అవుతుంది. మరి ఈ సమయంలోనే తమిళ్ మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం తాలూకా ట్రైలర్ లాంచ్ కు టైం ఫిక్స్ చేసారు.

ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను నిర్మాణ సంస్థ 7 జి ఫిలింస్ వారు రిలీజ్ చెయ్యడానికి రెడీ చేశారు. మరి తమిళ్ లో ఈ చిత్రం రీసౌండ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సమంతా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రం అక్కడ వచ్చే ఏప్రిల్ 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :