ఒక్కడులో ఆ సెట్ గురించి గొప్పగా చెప్పుకున్నారు.

Published on Aug 9, 2020 11:39 am IST

మహేష్ కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ కొట్టిన చిత్రం ఒక్కడు. 2003లో మహేష్ ఏడవ చిత్రంగా వచ్చిన ఆ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఫ్యాక్షనిస్ట్ నుండి అమ్మాయిని కాపాడే కబడ్డీ ప్లేయర్ గా మహేష్ నటించడం జరిగింది. కర్నూలు నుండి తీసుకువచ్చిన అమ్మాయిని పేరెంట్స్ కి ముఖ్యంగా పోలీస్ అయిన వాళ్ళ నాన్నకు కనబడకుండా దాచటానికి మహేష్ పడే ఇబ్బందులు భలే వినోదాన్ని పంచుతాయి. కాగా ఈ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం దర్శకుడు గుణశేఖర్ ఓల్డ్ సిటీలోని ప్రఖ్యాత చార్మినార్ సెట్ వేయించారు.

మహేష్, భూమికలపై ఓ రొమాంటిక్ సన్నివేశంతో పాటు, మరో కీలక సన్నివేశం ఆ సెట్ లో తెరకెక్కించారు. అప్పట్లో ఆ చార్మినార్ సెట్ గురించి ప్రత్యేకంగా చెప్పు కోవడం జరిగింది. ఆ మూవీ విజయం తరువాత మహేష్ దర్శకుడు గుణశేఖర్ తో రెండు సినిమాలు చేశాడు. ఒకటి అర్జున్ కాగా మరొకటి సైనికుడు. అర్జున్ మూవీ కోసం వేయించిన మధుర మీనాక్షి టెంపుల్ సెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇక సైనికుడు మూవీలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ విలన్ రోల్ చేశారు.

సంబంధిత సమాచారం :

More