విజయ్ దేవరకొండ పై ఛార్మి ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

Published on May 9, 2021 11:04 pm IST

నటనకు గ్యాప్ ఇచ్చి నిర్మాతగా మారిన చార్మి కౌర్ మొత్తానికి విజయ్ దేవరకొండ గురించి సింగిల్ లైన్ లో చెప్పేసింది. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, ఛార్మి సోషల్ మీడియాలో విజయ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూనే విజయ్ పట్ల తన ప్రేమను వ్యక్త పరుస్తూ..”నీ గురించి చెప్పడానికి ఒక లైన్’ అని ‘నువ్వు బంగారం 26 క్యారెట్ గోల్డ్’ అని విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఛార్మి నిర్మాణంలో పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా “లైగర్”. ఈ సినిమా వెరీ ఎమోషనల్ గా.. పవర్ ఫుల్ యాక్షన్ తో సాగుతుందట. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :