
పినాకిన్ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీమతి పద్మలత సమర్పణలో మోహన్ నిమ్మకాయల దర్శకనిర్మాతగా రామ్ దివ్యేష్ – స్పందన అల్లూరి హీరో హీరోయిన్స్ గా తెర్కేక్కిన్ సినిమా ‘చేజ్’. పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ పూర్తి కావడంతో ఈ చిత్ర తెమ రిలీజ్ డేట్ ని కూడా ఫైనలైజ్ చేసారు.
ఈ చిత్ర టీం చేజ్ సినిమాని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘చేజ్’ సినిమా మొత్తాన్ని అమెరికాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. సంగీత దర్శకుడు శంకర్ తమిరి సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఇటివల ఆదిత్య మ్యూజిక్ ద్వారా మర్కెట్‌లో రిలీజై మంచి రెస్పాన్స్‌ను సోంతం చేసుకున్నాయి. ఈ మూవీలో నిశాంత్, లోకనాథ్ పరవస్తు, హరి రామ్, పిల్ అవ్డా, టాం హెన్రి, క్రిస్ గిల్మోరే తదితరులు ముఖ్యపాత్రలను పొషించారు.

