నాగ చైతన్య క్రేజీ మూవీ మొదలైంది !

నాగ చైతన్య క్రేజీ మూవీ మొదలైంది !

Published on Oct 25, 2020 9:07 PM IST

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసి.. అక్కినేని ఫ్యామిలీకి గొప్ప సినిమా ఇచ్చాడు. అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అంటూ అఖిల్ కి హిట్ ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఇక ఈ సారి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యతో ఈ రోజు ‘థాంక్ యు’ అనే సినిమాని మొదలుపెట్టాడు, దసరా శుభ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో సరళంగా ప్రారంభించారు. ఈ సినిమాకి పి.సి శ్రీరామ్ కెమెరావర్క్ చేస్తున్నారు.

కాగా ఇప్పటికే షూట్ కు అవసరమైన సెట్స్ ను కూడా మేకర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి చైతుకి విక్రమ్ ఈ సారి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. దిల్ రాజు తన బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నాగచైతన్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్నారు. అలాగే చైతు జాబితాలో నెక్స్ట్ విక్రమ్ కె కుమార్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వెంకీ అట్లూరి ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు