‘మజిలీ’ వెరీ వెరీ స్పెషల్ అంటా !

Published on Apr 7, 2019 5:17 pm IST

మొత్తానికి నాగ చైతన్య – సమంత మళ్లీ చాలా సంవత్సరాల తరువాత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘మజిలీ’ చిత్రం మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు సాధిస్తోంది. దానికి తోడు సినిమాలో చైతు – సమంత నటన సినిమాకే హైలెట్ నిలవడంతో చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ సందర్భంగా ససమంత మాట్లాడుతూ.. ‘ ఈ సినిమా మాకు ఎంత ముఖ్యమో అందరికి తెలుసు.. సినిమా రిపోర్ట్ కోసం చాలా టెన్షన్ పడ్డాను.. చివరికి సినిమా చాల పెద్ద హిట్ అయ్యింది.. ఈ సినిమా పై వందశాతం నమ్మకం పెట్టుకున్నాను.. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.. మాకు ఇంత మంచి హిట్ ఇచ్చిన శివ గారికి చాల థాంక్స్.. ఏ మాయ చేసావే తర్వాత మంచి అనుభూతి ఇచ్చిన సినిమా మజిలీ.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి థాంక్స్. అని అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికి చాల చాల థాంక్స్..స్క్రిప్ట్ విన్నప్పుడు ఏ పాయింట్స్ కి అయితే కనెక్ట్ అయ్యానో ప్రేక్షకులు కుడా ఆ పాయింట్స్ కే కనెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నటుడిగా మంచి సంతృప్తినిచ్చింది. ఇంత మంచి సినిమా నాతో చేసినందుకు శివగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమాలో అందరు చాలా బాగా నటించారు. ప్రొడ్యూసర్ కథను నమ్మి చేసి మంచి హిట్ కొట్టారు. మజిలీ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్ అని తెలిపారు.

సంబంధిత సమాచారం :