చీటింగ్ కేసులో శ్రీదేవి భర్త బోనీ కపూర్

Published on Jun 20, 2019 11:01 pm IST

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోనికపూర్ పై చీటింగ్ కేసు నమోదైంది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహణ విషయంలో ప్రవీణ్ శ్యామ్ అనే వ్యక్తి బోనికపూర్ తో పాటు మరికొందరిపై ఈ చీటింగ్ కేసు నమోదు చేశారు. పవన్ జంగిద్ అనే వ్యక్తి 2018 లో త్వరలో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ జరగనుందని మీరు కనుక పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఆర్జించవచ్చని చెప్పి నమ్మించడంతో నేను నా స్నేహితుడు కలిసి 99లక్షలు ఇవ్వగా, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఇప్పటివరకు నిర్వహించకపోగా, తమ డబ్బులు కూడా తమకు తిరిగి ఇవ్వడం లేదని పవన్ జంగిద్,బోని కపూర్ మరి కొందరిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

నాతోపాటు మరికొందరు రెండున్నర కోట్ల పైన వీరి చేతిలో మోసపోయారని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తాం అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More