రేపే ‘చీకటి రాజ్యం’ తమిళ వర్షన్ రిలీజ్!

రేపే ‘చీకటి రాజ్యం’ తమిళ వర్షన్ రిలీజ్!

Published on Nov 9, 2015 3:00 PM IST

chikatirajyam
విశ్వనటుడు కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన ‘చీకటి రాజ్యం’ (తూంగవనం) అనే సినిమా దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. నవంబర్ 10న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని కమల్ భావించినా, అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైన అఖిల్ సినిమా కోసం కమల్ తెలుగు వర్షన్‌ను పదిరోజుల పాటు వాయిదా వేశారు. ఇక దీంతో రేపు ఒక్క తమిళ వర్షన్ అయిన ‘తూంగవనం’ మాత్రమే విడుదల కానుంది.

ఇక ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా కొద్దిగంటలే ఉండడంతో కమల్ అభిమానులంతా ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి మొదలుపెట్టేశారు. ఒకేఒక్క రాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో నడిచే ఈ సినిమా టెక్నికల్ అంశాల పరంగా ఇండియన్ సినిమాల్లో ఓ ప్రత్యేకత చాటుకుంటుందని కమల్ హాసన్ తెలిపారు. ఇక ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతాలతో యూఎస్‌లో కొన్ని ప్రీమియర్ షోస్ ప్రదర్శితమవుతున్నాయి. కమల్ ఈ సినిమాతో కచ్చితంగా తన హిట్ పరంపరను కంటిన్యూ చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజేష్ ఎమ్. సెల్వ దర్శకత్వం వహించారు. ఇక తెలుగు వర్షన్ చీకటి రాజ్యం నవంబర్ 20న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు