టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో ‘చీకటి రాజ్యం’

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో ‘చీకటి రాజ్యం’

Published on Nov 4, 2015 3:20 AM IST

Cheekati-Rajyam
విశ్వనటుడు కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన ‘చీకటి రాజ్యం’ (తూంగవనం) అనే సినిమా దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. నవంబర్ 10న తమిళ వర్షన్ ‘తూంగవనం’ విడుదల కానుండగా, నవంబర్ 20న ‘చీకటి రాజ్యం’ విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ‘చీకటి రాజ్యం’ ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్‌ వచ్చిన కమల్, సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘స్లీప్‌లెస్ నైట్’ అనే సినిమాను ఆధారంగా చేసుకొని ఆ సినిమాకు మించిన ఎమోషన్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించామని కమల్ తెలిపారు.

ఒకేఒక్క రాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో నడిచే ఈ సినిమా టెక్నికల్ అంశాల పరంగా ఇండియన్ సినిమాల్లో ఓ ప్రత్యేకత చాటుకుంటుందని కమల్ హాసన్ తెలిపారు. లాస్ ఏంజిల్స్ స్టూడియోలో దర్శకుడు రాజేష్ ఎమ్ సెల్వ, సంగీత దర్శకుడు గిబ్రాన్‌లతో పాటు పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ సమక్షంలో సౌండ్ మిక్సింగ్ చేశామని, ఆ రిజల్ట్ సినిమా చూసే ప్రేక్షకులకు సరిగ్గా అర్థమవుతుందని కమల్ తెలిపారు. ఇక షాట్ కంపోజిషన్, లైటింగ్‌తో పాటు ఈ సినిమాకు అన్నివిధాలా ఒక హై క్లాస్ టెక్నికల్ ఔట్‌పుట్ తేవడంలో సఫలమయ్యామని కమల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

తాజా వార్తలు