మణిశర్మ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్

మణిశర్మ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్

Published on Jul 12, 2026 1:00 AM IST

‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమాను అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి మెలొడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. కాగా, శనివారం మణిశర్మ పుట్టినరోజు వేడుకలను ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం సెట్స్‌లో ఘనంగా నిర్వహించింది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్, సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి ఈ వేడుకల్లో పాల్గొని, కేక్ కట్ చేసి ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు.

మెలొడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘తొలి ప్రేమేం తోపు కాదే..’, ‘వదలనే..’, ‘జిగితార..’, ‘హొయిలా హొయిలా’ వంటి పాటలు చాట్ బస్టర్స్‌గా నిలిచి మ్యూజిక్ లవర్స్‌ను అమితంగా అలరిస్తున్నాయి. ఈ సూపర్ హిట్ ఆల్బమ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేయడంతో, జూలై 24న విడుదల కాబోతున్న ఈ ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు