ఇంటర్వ్యూ : చేతన్‌ మద్దినేని – మారుతిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు !

Published on Jun 19, 2019 3:41 pm IST

నరేష్‌ కుమార్‌ దర్శకత్వంలో చేతన్‌ మద్దినేని, కౌశిక్‌ ఓరా జంటగా డాల్ఫిన్‌ ఎంటర్‌ టైన్మెంట్స్‌ పతాకం పై మంజునాధ్‌ వి. కందుకూర్‌ నిర్మిస్తున్న చిత్రం ” ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు”. విద్య 100% బుద్ధి 0% అనేది ఉపశీర్షిక. కాగా ఈ సినిమా జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా చేతన్‌ మద్దినేని మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

 

ముందుగా, ఈ సినిమా గురించి చెప్పండి?

 

రాజు అనే వ్యక్తి లైఫ్ స్టోరీనే ఈ ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’ సినిమా. అయితే రాజు లైఫ్‌ జర్నీలో జరిగిన కొన్ని సంఘటనల నుండి ఈ సినిమాలో ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మన విద్యా రంగం కారణంగా పిల్లలు ఎలాంటి ఇబ్బందలు పడుతున్నారు, అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంటుంది.

 

‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’లో మీ పాత్ర గురించి ?

 

ఈ సినిమాలో ఇన్నోసెంట్‌ గా కనిపిస్తాను, అలాగే ఆ ఇన్నోసెంట్‌ కి పూర్తి అపోజిట్ గా మారతాను. ఎందుకు అలా ట్రాన్సఫార్మ్‌ అవ్వాల్సి వచ్చిందనేది సినిమా. ఈ సినిమాలో నేను చేసిన డిఫ్రెంట్‌ క్యారెక్టర్స్‌ ప్రేక్షకులను ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తాయి.

 

ఈ సినిమా రీమేక్ కదా. కన్నడ వెర్షన్‌ కు తెలుగులో ఏమైనా మార్పులు చేశారా?

 

మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాము. కన్నడ సినిమాలోంచి సోల్‌ మాత్రమే ఈ సినిమాలో తీసుకున్నాం. ట్రీట్మెంట్ పరంగా ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది.

 

ఈ సినిమానే రీమేక్ చెయ్యాలని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా ?

 

సినిమాలో కంటెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ తో ముడి పడి ఉంటుంది. అలాగే సినిమా తల్లిదండ్రులకు పిల్లలకు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా మన విద్యావ్యవస్థకి సంబంధించి కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ర్యాంక్‌ రాకపొతే ఆత్మహత్యల వైపు పరుగెడుతోంది యువతరం. అది తప్పు అని తెలియజెప్పే ప్రయత్నమే ఈ సినిమా.

 

ఈ సినిమా విషయంలో దర్శకుడు మారుతి పాత్ర గురించి ?

 

మారుతిగారు మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆయన స్క్రిప్ట్ లో చేసిన మార్పులే కారణం. అలా ఆయన చాలా బాగా హెల్ప్ చేశారు. ఆయన ఇచ్చిన సజెషన్స్‌ కూడా నాకు చాల బాగా ఉపయోగపడ్డాయి. ఈ సందర్భంగా మారుతిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

 

మీకు జోడిగా నటించిన హీరోయిన్‌ కౌశిక్‌ ఓరా గురించి చెప్పండి ?

 

తను ఈ సినిమాలో చాలా మోడర్న్‌ గర్ల్ రోల్ లో నటించింది. తన నటనతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు రాకపోయినా తను నేర్చుకొని అర్ధం చేసుకొని డైలాగ్ లు చెప్పింది. ఈ సినిమా ద్వారా కౌశిక్‌ ఓరాకి మంచి పేరు వస్తుంది.

 

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

 

మరో రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’ సినిమా విడుదల పై నా దృష్టి అంతా ఉంది. ప్రేక్షకుల స్పందన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

సంబంధిత సమాచారం :

X
More