ఓటిటి సమీక్ష: ‘ఛోరీ 2’ – హిందీ హారర్ చిత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘ఛోరీ 2’ – హిందీ హారర్ చిత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం

Published on Apr 11, 2025 3:35 PM IST

Dupahiya

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 11, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : నుష్రత్ భరూచా, సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజని, సౌరభ్ గోయల్, పల్లవి అజయ్, కుల్దీప్ సరీన్, హార్దికా శర్మ.
దర్శకుడు : విశాల్ ఫ్యూరియా
నిర్మాతలు : విపిన్ అగ్నిహోత్రి, విక్కీ భాటియా, జాక్ డేవిస్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్
సంగీతం : అద్రిజా గుప్త
సినిమాటోగ్రఫీ : అన్షుల్ చోబె
ఎడిటర్ : అభిషేక్ ఓజా

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

హిందీ సినిమా దగ్గర లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటిటిలోకి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో ‘ఛోరీ’ కూడా ఒకటి. నటి నుష్రత్ భరూచా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ ని మళ్ళీ మేకర్స్ ప్రైమ్ వీడియో లోనే తీసుకొచ్చారు. మరి ఈ హారర్ సీక్వెల్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

సాక్షి(నుష్రత్ భరూచా) తన భర్త రాజ్ బీర్/ హేమంత్ (సౌరభ్ గోయల్) ని చంపేశా అని పోలీసులకి లొంగిపోయాక సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఆమెని పోలీసులు అరెస్ట్ చేయరు. ఆ తర్వాత ఆమె సిటీకి తన కూతురు ఇషాని (హార్దిక శర్మ)ని తీసుకొచ్చి ఆమె టీచర్ గా పని చేస్తూ పెంచుకుంటుంది. ఇలా ఏడేళ్లు గడిచిపోతాయి. అయితే ఇషానికి ఉన్న ఒక ఇబ్బంది మూలాన తాను ఎండ లోకి రాకూడదు. ఇలా చాలా జాగ్రత్తగా సాగుతున్న వీరి లైఫ్ లో ఓ రోజు ఇషానిని సాక్షి వదిలేసి వచ్చిన గ్రామస్తులు కిడ్నాప్ చేసి మళ్ళీ ఊరు తీసుకెళ్ళిపోతారు. వారు ఆ పాపని ఎందుకు తీసుకెళ్ళిపోతారు? తన పాపని ఏం చేద్దాం అనుకుంటారు? సాక్షి తన కూతురుని కాపాడుకుంటుందా లేదా? సాక్షి ఫ్రెండ్, పోలీస్ అయ్యిన సమర్ (గశ్మీర్ మహాజని) ఏం చేసాడు? అలాగే దేశీ మా (సోహా అలీఖాన్) ఆ పాపతో ఏం చెయ్యాలని చూస్తుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మొదటి పార్ట్ హిట్ కావడంతో పార్ట్ 2 పై కూడా మంచి అంచనాలు ఆడియెన్స్ లో ఉన్నాయి. అయితే ఒరిజినల్ మరాఠీ చిత్రంకి సీక్వెల్ లేనప్పటికీ హిందీ మేకర్స్ ప్లాన్ చేసిన సీక్వెల్ లో పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆది మానవుడికి కొన్ని మూఢ నమ్మకాలు ముడి పెట్టడం ఇందులో హారర్ సహా సోషల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం బాగుంది.

ఇక మంచి సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్స్ ని ఎలాంటి అంచనాలు లేకుండా ట్రై చేసేవారికి ఛోరీ మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. పార్ట్ 1 చూడకపోయినా కూడా డైరెక్ట్ పార్ట్ 2 చూసినప్పటికీ మొదటి భాగంలో కొన్ని సీన్స్ తో చూపించి కొత్తగా చూసినవారికి ఈ చిత్రం నచ్చవచ్చు. మెయిన్ గా ఫస్టాఫ్ లో సినిమా మొదలైన సీన్ నుంచే మంచి హారర్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి.

అలాగే ఇదే కోవలో మరికొన్ని హారర్ సీన్స్ థ్రిల్ చేస్తాయి. అలాగే సెకండాఫ్ లో కూడా కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతూ క్లైమాక్స్ చేరే సరికి ఇంకొంచెం థ్రిల్ గా అనిపిస్తుంది. ఆ ఆదిమానవుడు ఎవరు? అతనిపై అల్లుకున్న కథనం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే చివరిలో ఈ కథకి భిన్నంగా బాల్య వివాహాలకు సంబంధించి ఇచ్చిన మెసేజ్ కూడా డీసెంట్ గా అనిపిస్తుంది.

ఇక నటీనటుల్లో అయితే నుష్రత్ భరూచా సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించిందని చెప్పాలి. మెయిన్ గా క్లైమాక్స్ పోర్షన్ లో మాత్రం తన పెర్ఫామెన్స్ మరింత మెప్పిస్తుంది. తనతో పాటుగా తన కూతురుగా చేసిన చిన్నారి నటి హార్దిక శర్మ చాలా బాగా చేసింది. దేశి మా గా నటి సోహా అలీ ఖాన్ కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని ఆమె అందించారు. వీరితో పాటుగా గశ్మీర్ సహాయక పాత్రలో బాగా చేసాడు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో లైన్ బాగా తీసుకున్నారు. పార్ట్ 2 కి స్కోప్ ని బాగా క్రియేట్ చేసుకున్నారు కానీ సెకండాఫ్ లో అక్కడక్కడా కథనం నెమ్మదించింది అని చెప్పాలి. ఒక గజిబిజి పజిల్ లాంటి అండర్ గ్రౌండ్ సెటప్ లో సన్నివేశాలు ఒకింత రిపీటెడ్ గా వస్తున్నట్టుగా అనిపిస్తుంది.

నుష్రత్ పై ఆ ఎపిసోడ్స్ ని తగ్గించాల్సింది. దీనితో కథనం ఇంకొంచెం గ్రిప్పింగ్ గా మారేది. అలాగే సెకండాఫ్ కి వచ్చే సరికి ఈ సీన్స్ ని ఎక్కువ పెట్టేసి సమర్ పాత్రని నామ మాత్రంగా ప్రెజెంట్ చేశారు. తన రోల్ ని కూడా కొంచెం బ్యాలెన్సింగ్ గా తీసుకెళ్లి ఉంటే బాగుండేది. వీటితో పాటుగా ఈ రిపీటెడ్ సన్నివేశాలే అనుకుంటే ఇక్కడ కథనం కూడా స్లోగా సాగుతుంది. దీనితో కొన్ని చోట్ల మాత్రం బోర్ ఫీల్ కావచ్చు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రం టెక్నీకల్ గా మాత్రం స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. టీ సిరీస్ వారి నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. మెయిన్ గా సినిమా పాయింట్ కి కావాల్సిన సెటప్ అంతటినీ అద్భుతమైన ఆర్ట్ వర్క్ తో క్రియేట్ చేసి ప్రెజెంట్ చేశారు. అలాగే పలు సీన్స్ లో కెమెరా వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది. దానికి తోడు అలాంటి సీన్స్ కి వినిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా ఇందులో బాగుంది.

ఇక ఈ చిత్ర దర్శకుడు విశాల్ ఫ్యూరియా వర్క్ ఈ చిత్రానికి బాగుంది. హారర్ సహా పలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని తాను బాగా హ్యాండిల్ చేశారు. అలాగే ఫస్టాఫ్ ని తాను డీల్ చేసిన విధానం బాగుంది కానీ ఇదే రీతిలో సెకండాఫ్ మొత్తాన్ని డీల్ చేసి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ముందు వరకు కథనాన్ని తాను ఒకింత డల్ గా అనిపిస్తుంది. ఇది మినహా మిగతా అంతా బాగానే తెరకెక్కించారు.

తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఛోరీ 2” లో అక్కడక్కడా హారర్ ఎలిమెంట్స్ సహా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ కూడా మొదటిసారి ఈ ఫ్రాంచైజ్ లో ఈ సినిమా తోనే స్టార్ట్ చేసినవారికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అలాగే నుష్రత్ భరూచా రోల్ ఎలా అయితే ఈ సినిమాలో మొదలవుతుందో అదే పాత్రతో ఎండ్ చేయడం అనేది బాగుంది. ఫస్ట్ పార్ట్ తో బాగా ఇంప్రెస్ అయ్యినవారు మాత్రం ఈ సినిమా విషయంలో డిజప్పాయింట్ కావచ్చు. ఈ మధ్యలో సెకండాఫ్ కొంచెం అక్కడక్కడా సీన్స్ బోర్ అనిపిస్తాయి తప్పితే ఓటిటిలో ఈ సినిమా కొత్తగా ట్రై చేసిన వారికి మాత్రం బాగానే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు