ఆసక్తిరేపుతున్న “అక్షర” టీజర్.

Published on Jun 20, 2019 12:13 pm IST

ప్రముఖ కథా రచయిత చిన్ని కృష్ణ దర్శకుడుగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం “అక్షర”. ఈ చిత్రం మొదలుపెట్టిన నాటినుండి ఆసక్తిగొలిపే పోస్టర్స్ తో సినిమాపై ప్రేక్షకులు ఒక పాజిటివ్ ఒపీనియన్ కలిగేలా చేయడంలో దర్శకుడు విజయం సాధించారనే చెప్పాలి. టీజర్ మొత్తం అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్ తో సాగుతుంది. పేరులేని పెద్దమనిషిగా చలామణి అవుతున్న అజయ్ ఘోష్ తన ఒంటరి జీవితానికి తోడుకొరకు టిక్ టాక్ లు చేస్తూ బాధ్యత లేకుండా తిరిగే ముగ్గురు యువకులతో స్నేహం చేస్తాడు. ఆనందంగా గడుపుతున్న వాళ్ళ ప్రపంచంలోకి అక్షర అనే ఓ అందమైన టీచర్ రాకతో సమస్యలు మొదలవుతాయి. దానితో ఆమెను చంపాలనే నిర్ణయానికి వస్తారు ఈ నలుగురు మిత్రులు. అసలు అక్షర టీచర్ ఎవరు? ఆమెవలన వారికి వచ్చిన ఇబ్బందులేంటి? అక్షర సాధించాలనుకున్న ఆ మంచి లక్ష్యం ఏమిటీ? అనే సందేహాల సమాహారమే ఈ చిత్రం.

ప్రధాన పాత్రలలో నటించిన అజయ్ ఘోష్,షకలక శంకర్,మధు,సత్య ల నటన బాగుంది. అక్షర టీచర్ గా “ఎక్కడికి పోతావు చిన్నవాడా” ఫేమ్ నందిత శ్వేతా చేశారు.

కామెడీ సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని అహితేజ బెల్లంకొండ,సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టీజర్ కోసంక్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More