సైరా’ విషయంలో చిరుని కలవరపెడుతున్న అంశం అదొక్కటే

Published on Jun 20, 2019 3:00 am IST

రీఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా ఎలాంటి కథైతే తనని అభిమానులు, ప్రేక్షకులు చూస్తారనే విషయంపై ఎక్కువ దృష్టిపెడుతున్న ఆయన ఔట్ ఫుట్ అంచనాలను అందుకునేలా ఉండాలని షరతు పెట్టుకున్నారు. ‘సైరా’ విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ గొప్పగా ఉండేలా చూసుకుంటున్నారు.

పైగా ‘బాహుబలి’ విఎఫ్ఎక్స్ పరంగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి వెళ్ళిపోయింది. దీంతో ప్రతి పెద్ద సినిమా అలానే ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇదే చిరును కలవరపెడుతోందట. ఆరంభంలో చేసిన విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేకపోవడంతో మళ్ళీ మొదటి నుండి ఆ పనులు స్టార్ట్ చేశారనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ మీద స్వదేశీ, విదేశీ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. అన్నిటికీ బాహుబలి సినిమానే టార్గెట్. ఆ స్థాయిలో ఎఫెక్ట్స్ క్వాలిటీ ఉండాలనేది చిరు అల్టిమేటం.

పనులైతే రాత్రి పగలు జరుగుతున్నాయి. త్వరలోనే ఫైనల్ కాపీ రెడీ అవుతుంది. అది అనుకున్నట్టే గొప్పగా రావాలని, ఏమాత్రం తేడా వచ్చినా రిజల్ట్ దెబ్బతింటుందని మెగాస్టార్ భావిస్తున్నారు. టీమ్ మాత్రం చిత్రం అనుకున్నదానికంటే గొప్పగా వస్తోందని, ఎలాంటి కంగారు అక్కర్లేదని చెబుతోందట. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :