వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం గొంతు విప్పిన చిరు

Published on Apr 22, 2021 9:39 pm IST

వైజాగ్ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రాలో ఉద్యమాలు మొదలయ్యాయి. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయవద్దని వేల మంది విజ్ఞప్తి చేస్తున్నారు. సినీ ప్రముఖులను కూడ వుశాఖ ఉక్కుకు అనుకూలంగా మాట్లాడాలని చాలామంది కోరారు. అయితే ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచించాలని కోరుతూ వస్తున్న ఆయన తాజాగా మరోసారి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రాముఖ్యతను తెలియజేసేలా ట్వీట్ వేశారు.

ప్రజెంట్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా ఉంది. ఆసుపత్రులు కోవిడ్ బాధితులతో నిండిపోతున్నాయి. ఆక్సిజన్ అవసరం అమితంగా ఉంటోంది. దేశంలో ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు పెద్ద ఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉంది. అలాంటి కేంద్రాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ దేశానికే సంజీవనిలా నిలుస్తోంది. రేపటికి ఒక స్పెషల్ ట్రైన్ ద్వారా 150 టన్నుల ఆక్సిజన్ ను మహారాష్ట్రకు అందిస్తోంది. ఈ విషయాన్నే ప్రస్తావించిన చిరు విపత్కర పరిస్థితుల్లో దేశానికి ఎంతగానో ఉపకరిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసమేనా మీరే ఆలోచించండి అన్నారు. చిరు స్పందన పట్ల విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :