మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో వీరు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అలాగే పనిలో పనిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పారు. తన అభిమానులందరూ వచ్చే ఏడాది సుఖసంతోషాలతో హాయిగా గడపాలని కోరుకున్నారు. విషెష్ చెవుతూ ప్రత్యేకమైన వీడియో విడుదల చేశారు.
ఇక రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తుండగా మరో హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో తన 152వ చిత్రం చేయాల్సివుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Megstar #Chiranjeevi and Megapowerstar #RamCharan convey Christmas ???? wishes to all who are celebrating the day pic.twitter.com/aBBsB1B22J
— ???????????????????????????????????????????? (@UrsVamsiShekar) December 25, 2019


