మెగా 158 : పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసిన చిరు-బాబీ.. నెక్స్ట్ షెడ్యూల్‌తో రక్తపాతమే..!

మెగా 158 : పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసిన చిరు-బాబీ.. నెక్స్ట్ షెడ్యూల్‌తో రక్తపాతమే..!

Published on Jun 11, 2026 7:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా158’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. చిరు-బాబీ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

అయితే, తాజాగా పొల్లాచ్చి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అక్కడ కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్సులు, టాకీ పార్ట్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ముగియడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ షెడ్యూల్‌కు చిత్ర టీమ్ సిద్ధమవుతోంది.

అయితే, త్వరలో ప్రారంభం కానున్న నెక్స్ట్ షెడ్యూల్‌తో బాక్సాఫీస్ దగ్గర రక్తపాతం సృష్టించేందుకు చిరు-బాబీ ప్లాన్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో, ఈ సరికొత్త మాస్ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు