ఎన్టీఆర్ యోగ క్షేమాలు కనుక్కున్న మెగాస్టార్ చిరు.!

Published on May 12, 2021 2:00 pm IST

జస్ట్ ఈ మధ్య కాలంలోనే మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అనేక మంది కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజే కోలుకున్నట్టు తెలిపాడు. మరి అలాగే కొన్ని రోజుల కితమే మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తాను కోవిడ్ పాజిటివ్ అయ్యినట్టుగా తెలిపాడు. దీనితో అభిమానులు సహా ఇతర తారలు తారక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఓ అద్భుతమైన న్యూస్ ను తెలియజేసారు. తాను స్వయంగా తారక్ తో మాట్లాడి యోగ క్షేమాలు కనుక్కున్నట్టుగా తెలిపారు. అలాగే ప్రస్తుతం తారక్ బాగానే ఉన్నాడని తన కుటుంబ సభ్యులు కూడా బాగానే ఉన్నారని తెలిపారు. అలాగే తారక్ ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నాడని తెలిసి తాను హ్యాపీ ఫీల్ అయ్యినట్టుగా మెగాస్టార్ తెలిపి తారక్ అభిమానులకు ఒక స్వీట్ అప్డేట్ ను ఇచ్చారు. అలాగే తారక్ త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు.

సంబంధిత సమాచారం :