ఎంతటి ఘనుడైనా తల్లికి కొడుకే…!

Published on Jan 30, 2020 7:05 am IST

మెగాస్టార్ స్టార్ చిరంజీవి తన తల్లిగారైన అంజనమ్మ పుట్టినరోజు వేడుకను నిన్న నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంజనమ్మతో ఆప్యాయంగా దిగిన ఫోటోలు ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతటి ఆప్యాయంగా తల్లి పుట్టినరోజు వేడుకను స్వయంగా జరిపిన చిరంజీని చూసిన ఎవరికైనా ఎంతటి ఘనుడైనా అమ్మకు కొడుకే అనిపించక మానదు. 1955 ఆగస్టు 22న చిరంజీవి, వెంకటరావు-అంజనమ్మ దంపతులకు జన్మించారు. చిరంజీవి తండ్రి ఒక సాధారణ కాన్స్టేబుల్ కాగా, తల్లి గృహిణి.

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 152వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :