రేపు చిరంజీవి ఆ వేడుకకు వస్తున్నాడు !

24th, January 2018 - 11:43:04 AM

నాగ శౌర్య, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుమల దర్శకత్వంలో వస్తోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఛలో’. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక యూసుఫ్ గూడాలోని పోలీస్ గార్డెన్ లో జరగబోతోంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి అతిథిగా రాబోతున్నాడు.

రాస్మిక మడోనా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు. చూసి చూడగానే అనే పాట విడుదలైన కొద్దిరోజుల్లోనే పాపులర్ అయ్యింది. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో నాగ శౌర్య విజయం సాదిస్తాడేమో చూడాలి. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంక‌ర ప్ర‌సాద్,ఉషా మూల్పూరి, మూల్పూరి లు సంయుక్తంగా ఈ చిత్ర్రాని నిర్మించారు.