మెగాస్టార్ సహాయం మళ్లీ మొదలైంది

Published on May 19, 2021 7:20 pm IST

కరోనా ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ మీద చాలా గట్టిగా కనిపిస్తోంది. సినిమాల విడుదలలు వాయిదాపడటమే కాదు షూటింగ్స్ కూడ నిలిచిపోయాయి. దీంతో చిన్న తరహా నటీనటులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు షూటింగ్స్ లేకపోవడంతో ఉపాధి మార్గం లేక పూట గడవడం కూడ కష్టంగా మారింది. అలాంటి వారు చాలామంది ఉన్నారు. వారి కష్టాన్ని గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఆర్టిస్టుల కోసం రూ.15 లక్షల రూపాయలను విరాళం ఇచ్చారు. చిరు వేసిన ఈ ముందడుగు ఈ అత్యవసర పరిస్థితుల్లో గొప్పదనే అనాలి. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇంకొందరు హీరోలు తమ వంతుగా ఆర్టిస్టుల కోసం సహాయం చేయడానికి ముందుకువచ్చే అవకాశం ఉంది. గత లాక్ డౌన్ సమయంలో సైతం మెగాస్టార్ చిరంజీవి ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం కరోనా రిలీజ్ ఫండ్ ఏర్పాటు చేశారు. దానికి చాలామంది నటీనటులు విరాళం ఇచ్చారు. ఆ విరాళాలు సినీ కార్మికులకు చాలా బాగా ఉపకరించాయి. ఇప్పుడు కూడ చిరు వేసిన ముందడుగు అలాంటి ప్రయత్నానికి దారితీస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం :