క్యారవాన్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకున్న చిరు

Published on May 20, 2021 5:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి సహాయం కొనసాగుతోంది. లాక్ డౌన్ మూలంగా సినిమాలు ఆగిపోయి చాలామంది చిన్న నటీనటులు ఉపాధిని కోల్పోయారు. వారి కష్టాలను గుర్తించిన చిరు వారి కోసం 15 లక్షల రూపాయలు విరాలమిచ్చారు. అంతకుముందు సీనియర్ నటి పావల శ్యామలగారు కష్టాల్లో ఉన్న సంగతి తెలిసి వెంటనే ఆమెను లక్ష రూపాయల చెక్ పంపారు. ఇక తాజాగా క్యారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబాన్ని కూడ చిరు ఆదుకున్నారు.

జయరామ్ ఇటీవలే కరోనా సోకి కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. జయరామ్ కుటుంబం ఆర్థికపరమైన కష్టాల్లో ఉందని తెలుసుకున్న చిరంజీవి వారికి తనవంతుగా లక్ష రూపాయల సహాయం అందించారు. దానికి సంబందించిన చెక్ ను జయరామ్ కుటుంబం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు అందుకుంది. ఈ సందర్భంగా జయరామ్ సతీమణి శోభారాణి మాట్లాడుతూ గతంలో నా భర్తకు ప్రమాదం జరిగినప్పుడు ఆదుకున్న చిరంజీవిగారు మరోసారి ఆర్థికంగా ఆదుకున్నారని, ఇది తన పిల్లలకు పెద్ద సహాయమని అన్నారు.

సంబంధిత సమాచారం :