ఆగష్టు నుండి ‘మెగాస్టార్’.. ?

Published on Apr 30, 2019 4:00 am IST

మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివ, మెగాస్టార్ తో చెయ్యబోతున్న సినిమా ఆగష్టు నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. ఇక చిరు కోసం కొరటాల ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేశారట.

మొత్తానికి డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. అందుకే చిరు కోసం కూడా తన శైలిలోనే స్టోరీ రాశాడట. ఈ చిత్రంలో సునీల్, అనసూయ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. .

సంబంధిత సమాచారం :