వేగంగా విస్తరిస్తున్న చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్

Published on Jun 1, 2021 2:09 am IST

ఆక్సిజన్ కొరతతో కోవిడ్ బాధితులు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. పటిష్టమైన యంత్రాంగంతో మొదలైన ఈ ఆక్సిజన్ బ్యాంక్ వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి పలు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటయ్యాయి. కోవిడ్ బాధితులు చాలామంది ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ నుండి పొందడం జరిగింది.

ఇంకొద్దిరోజుల్లోనే ఈ వ్యవస్థ మరింత విస్తృతం కానుంది. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశేష సేవలు అందిస్తున్న చిరు ఇలాంటి విపత్కర సమయంలో ముందుచూపుతో చేసిన ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ ఆలోచనను, ఆచరిస్తున్న తీరును సామాన్య ప్రజలతో పాటు అనేకమంది ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. అది ముగియగానే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ మొదలుపెడతారు. వీటి తర్వాత చేయాల్సిన ఇంకో రెండు ప్రాజెక్ట్స్ కూడ ఫైనల్ చేసుకున్నారు ఆయన.

సంబంధిత సమాచారం :