బుకింగ్స్ లో రికార్డులు బద్దలుకొట్టిన బాస్ సినిమా! రీజనల్ రికార్డు టికెట్స్ సేల్

బుకింగ్స్ లో రికార్డులు బద్దలుకొట్టిన బాస్ సినిమా! రీజనల్ రికార్డు టికెట్స్ సేల్

Published on Jan 22, 2026 5:53 PM IST

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రమే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి హిట్ గా నిలిచి రీజనల్ గా రికార్డు వసూళ్లు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకి కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. ఇలా మొత్తం ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు అందుకున్న సంక్రాంతి సినిమాగా ఇది నిలిచి అదరగొట్టింది.

ఇక లేటెస్ట్ గా బుకింగ్స్ లో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలుకొడుతూ దూసుకెళ్తుంది. ఈ సినిమాతో ఈ కొన్ని రోజుల్లోనే ఏకంగా 5.2 మిలియన్ ఫాస్టెస్ట్ టికెట్ సేల్స్ ని కొల్లగొట్టి బాక్సాఫీస్ బాక్సులు బద్దలగొడుతున్నారు మన శంకర వరప్రసాద్ గారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో కలిపి ఈ సినిమాకి 52 లక్షల టికెట్స్ కి పైగా అమ్ముడుపోయాయట. ఇది రీజనల్ గా ఆల్ టైం రికార్డు కూడా అని మేకర్స్ ప్రకటించారు.

దీనితో మెగాస్టార్ మేనియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో వెంకీ మామ కూడా సాలిడ్ రోల్ నటించగా నయనతార హీరోయిన్ గా నటించారు. అలాగే భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెలలు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు