తెలుగు సినిమా దగ్గర మెగాస్టార్ చిరంజీవి అందించిన సేవలు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వెండితెరపై నటుడుగా తాను చేయనిది ఏది లేదు అనే రీతిలో తను ఇప్పటికీ నిరంతర కృషీవలునిలా శ్రమిస్తున్నారు. అయితే తన నట వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో నేడు పెద్ది సక్సెస్ ఈవెంట్ లో తను కనబరిచిన వాత్సల్యం అంతా ఇంతా కాదు.
ఇది వరకు కూడా చరణ్ కోసం అనేకమార్లు మాట్లాడారు కానీ ఈసారి స్పీచ్ లో మాత్రం అంతకు మించిన ప్రేమ, వాత్సల్యం ముఖ్యంగా చెప్పాలంటే తన కొడుకు పట్ల ఒక గర్వంతో కూడిన ఆనందాన్ని మెగాస్టార్ ఫీల్ అవ్వడాన్ని మెగా ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారని చెప్పవచ్చు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ పెర్ఫామెన్స్ చూసి తను నూటికి నూరు శాతం సంతృప్తి ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా రామ్ చరణ్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడని అందరూ చెప్తుండడంతో అంతా చాలా ఆనందంగా అనిపించింది అని గతంలో రంగస్థలం సినిమాలో చరణ్ పెర్ఫామెన్స్ కి నేషనల్ అవార్డ్ వస్తుందని సుకుమార్ బలంగా నమ్మాడు ఇప్పుడు పెద్ది విషయంలో కూడా అంతా నమ్ముతున్నారు.
కానీ ఆ అవార్డ్ వచ్చినా రాకపోయినా.. అవి తెచ్చుకోడానికి ఇతర మార్గాలు కూడా ఉండొచ్చు అనే పాయింట్ చెప్పడం ఒకింత ఇప్పుడు చర్చకు దారి తీసింది. దీనితో నేషనల్ అవార్డ్స్ విషయంలో గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న రచ్చ విషయంలో మెగాస్టార్ కూడా పూర్తి సంతృప్తిగా లేరా అని అనుకోవచ్చు. ఇలా మెగాస్టార్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.


