నిహారిక సంగీత్‌లో చిరంజీవి పాటలకు స్టెప్పులు..!

నిహారిక సంగీత్‌లో చిరంజీవి పాటలకు స్టెప్పులు..!

Published on Dec 7, 2020 11:49 PM IST

niharika 5

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహంతో టాలీవుడ్‌లో అసలైన సందడి నెలకొంది. అయితే ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీలోని కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరూ ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అందరూ కలిసి నిహారికను పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. తాజాగా నిహారిక చైతుల సంగీత్ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ సంగీత్‌లో చిరంజీవి పాటలకు నిహారిక, చైతులు కలిసి స్టెప్పులు వేశారు. వీరితో పాటు మెగా, అల్లు ఫ్యామిలీలోని చిన్నారులు కూడా చిరంజీవి పాటలకు డ్యాన్సులు చేసి అలరించారు.

ప్రస్తుతం ఈ సంగీత్ ఫోటోలు, వీడియోలు మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

తాజా వార్తలు