సినిమా స్థాయిని పెంచే పనిలో ఉన్న చిరు !


మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి సినిమా స్థాయిని ఇంకాస్త పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

హిస్టారికల్ సినిమా కనుక ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయట. ఆ ఎఫెక్ట్స్ బాహుబలి క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉండాలని మెగాస్టార్, నిర్మాత రామ్ చరణ్ నిర్ణయించారట. అందుకే సినిమా బడ్జెట్ ను కూడా ఇంకాస్త ఎక్కువ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని చరణ్ కు ‘ధృవ’ తో అముఞ్చి కమర్షియల్ సక్సెస్ అందించిన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.