నాగార్జున కోసం ‘ఆచార్య’

Published on Mar 11, 2021 8:28 pm IST

కింగ్ అక్కినేని నాగర్జున చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇందులో నాగ్ ఎన్.ఐ.ఎ అధికారిగా కనిపించనున్నారు. ఇదొక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. హిమాలయాల్లాంటి టఫ్ లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. సినిమాను ఏప్రిల్ 2వ తేదీన భారీ ఎత్తున విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు టీమ్. రీలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు టీమ్. అయితే ఆ ఆరంభం అదిరిపోయేలా ఉండాలని ప్లాన్ చేసిన నాగ్ తన చిరకాల మిత్రుడు చిరంజీవిని రంగంలోకి దింపారు.

సినిమా ట్రైలర్ ను చిరు చేతుల మీదుగా లాంచ్ చేయించనున్నారు. రేపు సాయంత్రం 4: 05 గంటలకు చిరంజీవి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఛాన్నాళ్ల తర్వాత నాగార్జున యాక్షన్ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ట్రైలర్ గనుక క్లిక్ అయితే సినిమా మీద మంచి హైప్ క్రియేట్ కావడం ఖాయం. నూతన దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :