ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక, మర్చంట్ నేవీ ఆఫీసర్ శ్రవణ్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం గోవాలో వైభవంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున ఈ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడ ఈ ముగ్గురు స్టార్స్ ఒకేచోట చేరిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా వెంకటేష్, చిరంజీవితో కలిసి సరదాగా చిల్ అవుతూ సందడి చేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
గతంలో ఖుష్బూ ఈ ముగ్గురు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతోనే వెంకటేష్, ఖుష్బూ ఇద్దరూ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇన్నాళ్ల తర్వాత వారంతా ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


