ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఈ వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
మరో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఈ వివాహ వేడుకకు హాజరై తన ఆశీర్వాదాలు అందజేశాడు. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
వీరితో పాటు పలువురు విఐపీలు హాజరై కొత్త జంటకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


