మెగాస్టార్ సరసన మరో హీరోయిన్ పేరు?

Published on Feb 1, 2022 8:29 am IST


మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మెగాస్టార్ సరసన మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. మాళవిక మోహన్, మెగాస్టార్ కి హీరోయిన్ గా నటించబోతుందట. మరి చిరు – మాళవిక మోహన జోడీ నిజంగానే బాగుంటుంది.

ఐతే, ఈ వార్తల పై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక వెంకీ కుడుముల చిరుకు పూర్తి కథను కూడా వివరించాడని, కథ చిరుకి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, వెంకీ సినిమాని కూడా త్వరలోనే పట్టాలెక్కిస్తారట. కాగా మెగాస్టార్ ప్రస్తుతం ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ లాంటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో సినిమాని కూడా స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత వెంకీ కుడుముల సినిమా ఉండే ఛాన్స్ ఉందట. ‘ఛలో, భీష్మ’ లాంటి వరుస హిట్స్ తో వెంకీకి మంచి గుర్తింపు వచ్చింది.

సంబంధిత సమాచారం :