‘సర్దార్’ సెట్లో చిరు సందడి

Saradar
అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య సత్సంబంధాలు లేవని గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చిరు బర్త్ డే సంగీత్ కి పవన్ వచ్చినా, అలాగే బ్రూస్ లీ టైంలో చిరు రీ ఎంట్రీ విషయమై పవన్ చిరుని కలిసి అభినందించినప్పటికీ ఈ వార్తలు ఎక్కడో ఓ చోట వస్తూనే ఉన్నాయి. కానీ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ తో ఇలాంటి వార్తలకు తెరపడిందనే చెప్పాలి. అదేమిటంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో చిరు సందడి చేయడం..

అవును మీరు విన్నది నిజమే.. రీసెంట్ గా చిరంజీవి సర్దార్ సెట్స్ ని విజిట్ చేసి అక్కడి టీం మరియు పవన్ తో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళాడు. ఈ విషయాన్ని ఈ సినిమాలో మెయిన్ విలన్ గా చేస్తున్న కబీర్ దుహన్ సింగ్ తెలిపాడు. ‘నేను ఈ రోజు సెట్లో మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసాను. గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి.. చిరునవ్వుతోనే పలకరించే గొప్ప వ్యక్తి’ అని కబీర్ దుహన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, సంజన ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి శరత్ మరార్ నిర్మాత.

Exit mobile version