ఉగాది కి చిరు కొత్త నిర్ణయం

Published on Mar 24, 2020 2:34 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా రేపటి నుండి సోషల్ మీడియా అకౌంట్స్ ప్రారంభిస్తారట. ఈ విషయాన్నీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఆయన తెలియజేశారు. ఇక తన భావాలను, సందేశాలను తన అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకున్న చిరంజీవి సోషల్ మీడియా అకౌంట్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇకపై ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పేస్ బుక్ వంటి సోషల్ మాధ్యమాలలో చిరంజీవి కనిపించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన 152వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More