మెగాస్టార్ విడుదల చేయనున్న”కౌసల్య కృష్ణమూర్తి” టీజర్

Published on Jun 18, 2019 10:50 am IST

సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నటి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా క్రీడా ప్రధానంగా తెరకెక్కుతున్న మూవీ “కౌసల్య కృష్ణమూర్తి-ది క్రికెటర్”. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. క్రికెట్ ప్రాణంగా భావించే ఓ సాధారణ ఆడపిల్ల దేశం మెచ్చే క్రీడాకారిణిగా ఎదగడంలో ఎదురైన అవమానాలు,భాదలు, వేదింపుల మధ్య తన లక్ష్యం ఎలా సాధించింది అన్న కోణంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. మోటివేషనల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ మూవీ టీజర్ విశిష్ట అతిధి మెగాస్టార్ చేతుల మీదుగా నేటి సాయంత్రం 5:00 లకు విడుదల కానుంది. ఈ విషయం వెల్లడిస్తూ చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్ ని విడుదల చేశారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర చేస్తుండగా వెన్నెల కిషోర్,కార్తీక్ రాజు ప్రధాన తారాగణంగా చేస్తున్నారు. ధిబు నైనన్ థామస్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More