చిరు లూసిఫర్’ లాంచింగ్ డేట్ ఫిక్స్ !

Published on Jun 6, 2021 3:02 am IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విషయం పై మెగా కాంపౌండ్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. హీరోకి చెల్లి పాత్ర అయిన ఈ పాత్రలో మంజు వార్యర్ అద్భుతంగా నటించింది. అయితే తెలుగు వర్షన్ లో ఈ పాత్రలో విద్యాబాలన్ నటించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్త పై చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. విద్యాబాలన్ ‘లూసిఫర్’లోని చెల్లి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

కాగా ఈ సినిమా మిగిలిన క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆ పాత్రలో ఇప్పుడు హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు.

సంబంధిత సమాచారం :