మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయబోతున్నాడు. కాగా ఈ సినిమా జనవరి 20 నుండి మొదలయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ పూర్తీ సంతృప్తి చెందారని.. అందుకే ఈ సినిమాని లైన్ లో ముందుకు తీసుకువచ్చారని తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్ లో మార్పులు చేయనున్నారట. అలాగే ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందట.
కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్, ఈ సినిమా పూర్తయిన తరువాత తమిళ ‘వేదాళం’ రీమేక్ ను కూడా మొదలుపెడతారు. ఇక ఈ సినిమాను ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.


