దేవరకొండ సినిమాకు చిరంజీవి టైటిల్ పెట్టేశారుగా !

Published on May 19, 2019 6:58 pm IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ ఈరోజు కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. అదే ‘హీరో’. ఈ టైటిల్ ఎక్కడో విన్నట్టుంది కదా. అది మెగాస్టార్ చిరంజీవి 1984లో చేసిన ఒక సినిమాకు చెందిన టైటిల్. విజయబాపినీడు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. అప్పట్లో ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి చిరు కెరీర్ గ్రాఫ్ ఎదగడానికి దోహదపడింది.

ఇప్పుడు ఆ పేరునే విజయ్ సినిమాకు పెట్టారు. తెలుగు, తమిళంలలో రూపొందనున్న ఈ సినిమాను ఆనంద్ అన్నామలై డైరెక్ట్ చేయనున్నారు. బైక్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ‘పేట’ ఫేమ్ మాళవిక మోహనన్ కథానాయకిగా నటిస్తోంది. మరి చిరుకు బాగా కలిసొచ్చిన ఈ ‘హీరో’ టైటిల్ దేవరకొండకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More