చిరంజీవి చిన్నల్లుడికి వేధింపులు

Published on Jun 12, 2019 4:41 pm IST

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఈమధ్యే ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా ఇన్స్టాగ్రామ్ లో కొందరు పొకిరీలు తనను వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు దేవ్. పదిమంది వరకు గుర్తు తెలియని వ్యక్తులు తరచూ తనపై, తన కుటుంబంపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ వేధిస్తున్నారని పిర్యాధులో పేర్కొన్నారు కళ్యాణ్ దేవ్.

పిర్యాధును అందుకున్న అదనపు డీసీపీ రఘువీర్ దర్యాప్తు చేపట్టి వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల ఇన్స్టాగ్రమ్ ఐడీలను గుర్తించామని, వారి పూర్తి వివరాల కోసం ఇన్స్టాగ్రమ్ సిబ్బందిని సంప్రదించామని, పూర్తి వివరాలు అందగానే సదరు వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపోతే మొదటి సినిమాతో నటుడిగా మంచి మార్కులే వేయించుకున్న కళ్యాణ్ దేవ్ ఇంకా రెండవ సినిమాను అనౌన్స్ చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More