బర్త్ డే రోజు అభిమానులకు భారీ గిఫ్ట్ ఇవ్వనున్న ‘మెగాస్టార్’

11th, August 2016 - 05:39:55 PM

chiranjeevi
మెగా అభిమానులు ‘మెగాస్టార్ చిరంజీవి’ ని తిరిగి తెరపై చూడాలని ఎన్నాళ్లగానో పరితపించిపోతున్నారు. వాళ్ళ కోరిక తీరుస్తూ చిరంజీవి ఈ మధ్యే ‘వినాయక్’ తన 150వ సినిమాని మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ చిత్రం 30 % షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏ సినిమాలో యంగ్, డైనమిక్ గా కనిపించడానికి చిరు బాగానే కష్టపడ్డారు. వర్కవుట్లు చేసి, భుజానికి ఆపరేషన్ చేయించుకుని ఫిట్ గా తయారయ్యారు. మొదటిరోజు షూటింగ్ స్పాట్ లో ఆయన యాంగ్ లుక్ చూసిన అభిమానులు పొంగిపోయారు.

మామూలుగానే ఇలా ఉంటే ఇక సినిమాలో ఎలా ఉంటాడో చూడాలని ఎదురుచూస్తున్నారు. వాళ్ళ కోరికను నెరవేరుస్తూ చిరు కొత్త లుక్ కు సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆగష్టు 22 ఆయన పుట్టినరోజునాడు విడుదల చేయనున్నారు టీమ్. దీనికి సంబందించి ఫోటో షూట్ ను కూడా ఇప్పటికే మొదలుపెట్టేశారు. దీంతో పాటే సినిమా టైటిల్ ను కూడా అదేరోజు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘రామ్ చరణ్’ కొణిదల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దేవి శ్రీ ప్రసాద్’ సంగీతం సమకూరుస్తున్నారు.