చిరు 150వ సినిమాకి నాయిక ఖరారైందా.?

చిరు 150వ సినిమాకి నాయిక ఖరారైందా.?

Published on May 11, 2015 8:04 PM IST

chiru-puri
మెగాస్టార్ చిరంజీవి – టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ పేరు గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయనక్కర్లేదు.. రాజకీయ ప్రవేశం వల్ల గత 7 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి తన 150వ సినిమా అకోసం గత ఏడాదిగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా తన 150వ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ని డైరెక్టర్ గా ఫైనలైజ్ చేసారు. దీంతో మెగా అభిమానుల్లో ఎంతో సందడి నెలకొంది. ఈ విషయం ఖరారైందో లేదో అప్పుడే ఈ సినిమాకి సంబందించిన పలు విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం చిరంజీవి 150 వ సినిమా అకోసం సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ నయనతారని ఖరారు చేసారని అంటున్నారు. ఈ వార్తలు ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా మంది చిరు – నయనతార కాంబినేషన్ సూపర్బ్ గా ఉంటుందని అభిమానులు అప్పుడే కితాబులు కూడా ఇచ్చేస్తున్నారు. త్వరలోనే ఈ హీరోయిన్ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు. పూరి జగన్నాధ్ – బివిఎస్ రవి కలిసి కథని అందించిన ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నాడు. మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగష్టు 22న మొదలు పెట్టి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

తాజా వార్తలు