శాతకర్ణి, సైరా ఒకే ఫ్రేమ్ లో, అదుర్స్ కదూ …!

Published on Oct 12, 2019 11:14 am IST

సమకాలీన టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ల కలయిక ఎప్పుడూ ప్రత్యేకమే. దశాబ్దాలు పాటు వీరిద్దరూ స్టార్ హీరోలుగా కొనసాగారు. వీరి సినిమాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఏ వేదికలో కలిసినా చిరు, బాలయ్యలు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో పాటు, ప్రక్కపక్కనే కూర్చొని అనేక విషయాలు చర్చించుకుంటారు. కాగా ఓ పెళ్లివేడుక వీరిద్దరి కలయికకు కారణమైంది.

సీనియర్ దర్శకుడు దివంగత కోడిరామకృష్ణ కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్ధ రిసెప్షన్ పార్క్ హయ్యత్ హోటల్ లో ఘనంగా జరుగగా, ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన చిరు, బాలయ్య కలవడంతో పాటు అనేక విషయాలు చర్చించుకున్నారట. బాలయ్య సైరా విశేషాలు అడిగి తెలుసుకోగా, చిరు బాలయ్య చేస్తున్న చిత్రం గురించి వాకబు చేశారట. బాలయ్య గతంలో క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీ అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీలో నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More