జూన్ నుండి ‘మెగాస్టార్’తో స్టార్ డైరెక్టర్ !

జూన్ నుండి ‘మెగాస్టార్’తో స్టార్ డైరెక్టర్ !

Published on Apr 4, 2019 4:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివ, మెగాస్టార్ తో చెయ్యబోతున్న సినిమా జూన్ నుంచి మొదలు కానుందని తెలుస్తోంది.

ఇక డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. చిరు కోసం కొరటాల ఓ సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట.

ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు