చిరంజీవికి తప్పిన పెను ముప్పు

Published on Aug 31, 2019 10:07 am IST

మెగాస్టార్ చిరంజీవి పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారని తెలుస్తుంది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం జరిగింది. వివరాలలోకెళితే చిరంజీవి తాను నటిస్తున్న సైరా చిత్రానికి సంబంధించిన చర్చల కొరకు ముంబై వెళ్లారు. ఐతే నేటి ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకోవడానికి ముంబై ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కగా, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీనితో విమానంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడినట్టు తెలుస్తుంది.

ఆ విమానంలో చిరుతో పాటు 120మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనకు చిరు కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకు గురయ్యారట. కాగా చిరంజీవి నటించిన సైరా మూవీ అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :