చిరు చేత కంటనీరు పెట్టించిన యంగ్ హీరో

Published on Jan 18, 2020 10:00 pm IST

యంగ్ హీరో కార్తికేయ చిరంజీవి చేత కంటనీరు పెట్టించారు. తన గ్రేసింగ్ డాన్సులతో, భావోద్వేగ మాటలతో చిరు ఉద్వేగానికి గురయ్యేలా చేశారు. ఇటీవల జీ తెలుగు మూవీ అవార్డ్స్ 2020 వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో హీరో కార్తికేయ చిరంజీవి అలనాటి హిట్ సాంగ్ ‘పదహారేళ్ళ వయసు పడి పడి లేచే మనసు…’ సాంగ్ కి స్టేజ్ పరఫార్మెన్సు ఇచ్చారు. కార్తికేయ ఎనర్జిటిక్ స్టెప్స్ చూసి ముచ్చట పడ్డ చిరంజీవి, అనంతరం కార్తికేయ ఆయనని ఉద్దేశించి చెప్పిన మాటలకి కంటనీరు పెట్టుకున్నారు.

ఇక చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. కమర్షియల్ అంశాలు కలిగిన ఓ సోషల్ కాన్సెప్ట్ తో కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More