మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు!

Published on Aug 6, 2020 11:00 pm IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రతి పక్ష పార్టీగా ఉన్న బీజేపీ వచ్చే 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు పక్కా ప్రణాళిక తో దూసుకుపోతుంది. జన సేన పార్టీ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ, రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను నియమించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సోము వీర్రాజు దుకూడు గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా అధ్యక్షుడు బాధ్యత చెప్పటిన దగ్గర నుండి హాట్ టాపిక్ గా మారిపోయారు. అయితే సోము వీర్రాజు తాజాగా టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు.

చిరు నివాసం లో సోము వీర్రాజు కలవడం మాత్రమే కాకుండా, చిరు ఆశీర్వాదం తీసుకున్నారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టడం వలన శుభాకాంక్షలు తెలిపారు. చిరు, సోము వీర్రాజు ల మధ్య దాదాపు రెండు గంటలకు పైగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చ పూర్తి గా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల పై జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాక జన సేన పార్టీ తో బీజేపీ ప్రయాణం పై గురించి కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మున్ముందు 2024 లో జన సేన తో బీజేపీ అధికారం చేపట్టాలని చిరు విషెస్ తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చిరు కోరినట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి వద్దకు సోము వీర్రాజు తో పాటుగా ప్రముఖ నిర్మాత ఎస్. వి బాబు కూడా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More